తాగునీటి కోసం ఆందోళన
డుంబ్రిగుడ: రంగిలిసింగి పంచాయతీ వాకపల్లి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామస్తులు సీపీఎం ఆధ్వర్యంలో గుంటసీమ సచివాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల నాయకుడు పి.డొంబు మాట్లాడుతూ వాకపల్లి గ్రామానికి గతేడాది జల జీవన్ పథకం ద్వారా గ్రావిటీ పథకం మంజూరైనా నిర్మించడంలో అధికారుల నిర్లక్ష్యం వహించారన్నారు. తక్షణమే అధికారులు స్పందించి గ్రామంలో గ్రావిటీ పథకం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాందాస్, పొద్దు, జిన్ను కృష్ణారావు, బాలదేవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment