ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు
పాడేరు రూరల్: విద్యార్థులు ముందస్తు ప్రణాళికతోనే చది వితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టబ్బా యి అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, మహిళా సాధికారత శాఖ, జాతీయ సేవా పథఽకం ఆధ్వర్యంలో విద్యార్థులకు లైఫ్ సేవియర్‌లో భాగంగా ఫైర్ స్టేఫ్టీ, హెల్త్ అండ్ హైజెనిక్, సెల్ఫ్ డిఫెన్స్ సీపీఆర్ అనే అంశాలపై మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో విద్యనభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ రోహిణి, కళాశాల అధ్యాపకులు సుమిత్ర, నిర్మల, గౌరీశంకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment