చుక్కల జింకపై కుక్కల దాడి
అడ్డతీగల: మండలంలోని పాపంపేట పరిసరాల్లో సోమవారం కుక్కలు దాడి చేయడంతో ఓ చుక్కల జింక తీవ్రంగా గాయపడింది. కుక్కలు వెంటపడి గాయపరుస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు వాటి బారి నుంచి జింకను రక్షించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. పాపంపేట సెక్షన్ అధికారి అర్జునుడు పశుసంవర్ధకశాఖ సిబ్బందితో జింకకు చికిత్స చేయించారు.అనంతరం అడ్డతీగల అటవీ కార్యాలయానికి తరలించి సపర్యలు చేశారు. జింక గర్భందాల్చి ఉండడంతో ఆరోగ్యం కుదుటపడిన తరువాత అడవుల్లో వదిలివేస్తామని సెక్షన్ అధికారి అర్జునుడు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment