క్షేత్రస్థాయి సందర్శన తప్పనిసరి
సాక్షి,పాడేరు: జిల్లాలోని వీఆర్‌వోలందరూ క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా సందర్శించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సబ్‌కలెక్టర్లు, 22 మండలాల తహసీల్దార్‌లు,వీఆర్‌వోలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలు చేసేందుకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.సర్వే జరిపిన గ్రామాల్లో ఫిర్యాదులను తహసీల్దారులు సమగ్రంగా విచారించి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈనెలాఖరు లోగా భూ సరిహద్దుల సర్వే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 21 గ్రామాలను పైలట్‌గా తీసుకుని సర్వే చేస్తున్నట్టు చెప్పారు.రెవెన్యూ సదస్సుల ద్వారా 20,941 ఫిర్యాదులు వచ్చాయని,వీటిలో ఇంకా 3,798 వినతులు పరిష్కారం కావాల్సి ఉందన్నారు.వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వర గా పూర్తి చేయాలన్నారు.ఈ సమావేశంలో జేసీ అభిషేక్‌గౌడ,చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, డీఆర్‌వో పద్మలత,పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి
జిల్లాలో పీఎంఏవై, పీఎం జన్‌మన్ పథకాల గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఎంపీడీవోలను ఆదేశించారు.మంగళవారం పలుశాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక కారణాలు చూపి ఇళ్ల నిర్మాణాలను జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పీఎంఎవై 2.0 సర్వేను ఈనెల 20వతేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎంఎవై,పీఎం జన్‌మన్ పథకాల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు మంజూరు చేస్తోందని కలెక్టర్ తెలిపారు.ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనంగా లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలో 57,617 మంది లబ్ధిదారులకు సుమారు రూ.541.95 కోట్లు అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో జమాల్ బాషా, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి,హౌసింగ్ పీడీ బాబు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment