‘యువత పోరు’నువిజయవంతం చేయాలి
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
పెదబయలు: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిర్వహించే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. పాడేరులో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను స్థానిక అంబేడ్కర్ పార్కులో మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని, ముఖ్యంగా యువత, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిన కూటమి నేతలు వంచించారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. యువత పోరు కార్యక్రమానికి అరకులోయ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా యువత, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రబాబు, అరకు నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, మాజీ ఎంపీటీసీ పోయిభ కృష్ణారావు, లింగేటి సర్పంచ్ లింగేటి అప్పన్న,నాయకులు అమిడెల ప్రసాద్‌నాయుడు, పల్టాసింగి ధనరాజ్,కొమ్మ బాలరాజు,కూడ రాజారావు,పి.పద్మాకరరావు, పి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment