రంగు రాళ్ల క్వారీలోబాంబు బ్లాస్టింగ్
అడ్డతీగల: రంగురాళ్ల క్వారీలో ఇప్పటివరకూ గుణపాలు, పారలతో తవ్వకాలు జరుపుతుండగా తాజాగా వ్యాపారులు బాంబ్ బ్లాస్టింగ్‌కు పాల్పడడం కలకలం రేపుతోంది. రంగురాళ్ల కోసం ఇటీవల అడ్డతీగల అటవీ రేంజి పరిధిలోని తపస్వికొండ రక్షిత అటవీ ప్రాంతంలోని దుప్పులపాలెం సమీపాన రాతికొండ (రాయి క్వారీ)ను బాంబులతో పేల్చినట్టు తెలిసింది. అనంతరం రంగురాళ్ల సేకరణలో కొంతమేర సక్సెస్ అయినట్టు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో తవ్వకాలు తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెబుతున్నారు.రక్షిత అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు వినియోగించడం వల్ల వృక్ష సంపదకు, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అధికారులు స్పందించి రంగురాళ్ల తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై అడ్డతీగల సబ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డిని సంప్రదించగా తపస్వి కొండ రంగురాళ్ల క్వారీలో బ్లాస్టింగ్ జరిగిన విషయం వాస్తవమేనని చెప్పారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. విచారణ పూర్తయిన తరువాత చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment