మెరుగైన వైద్య సేవలందించాలి
చింతపల్లి: చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించిడంతో పాటు వారితో స్నేహభావం కలిగి ఉండాలని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో తొలిసారిగా అభివృద్ధి కమిటీ సమావేశాన్ని సూపరింటెండెంట్ ఇందిరా ప్రియాంక అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెన్సీలో వైద్యులను దేవునితో సమానంగా భావిస్తారన్నారు. ఏ రోగి వచ్చినా వైద్యులు, సిబ్బంది సేవలందించడంతో పాటు వారికి అప్యాయ పలకరింపుతోనే సగం రోగం నయం అవుతుందన్నారు. రోగుల పట్ల స్నేహభావం కలిగి ఉండాలన్నారు. ఆస్పత్రిలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అవవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు.
ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు
ఆస్పత్రిలో ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రియాంకను ఆదేశించారు. పలువురు రోగులు వ్యాధి తీవ్రతతో చికిత్స పొందేందుకు మైదాన ప్రాంతానికి వెళ్లేందుకు నిరాకరిస్తుంటారని, వారికి కౌన్సెలింగ్ చేయాల్సి అవసరముందన్నారు. ఈ మేరకు ఆస్పత్రిలో ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సూచించారు. ఆస్పత్రిలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు వంటి అసౌకార్యాలను వెంటనే మెరుగుపర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో పారిశుధ్య సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. ఎంపీపీ కోరాబు అనూష దేవి, సర్పంచ్ దురియా పుష్పలత, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సాగిన దేవుడమ్మ, జల్లి హలియారాణి, కవడం ఈశ్వరరావు, వైద్యులు భారతి, లావణ్య, రుక్మిణి, ప్రభావతి, రమేష్, సాయి కృష్ణ, ల్యాబ్ టిక్నిషియన్ అనిల్, వెఎస్సార్ ఎస్టీ సెల్ రాష్ట్ర సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ పాల్గొన్నారు.
ఏరియా ఆస్పత్రిలో కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస
విశ్వేశ్వరరాజు
మెరుగైన వైద్య సేవలందించాలి
Comments
Please login to add a commentAdd a comment