రంపచోడవరం ఎమ్మెల్యే వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఎటపాక: అసెంబ్లీలో రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం ఎటపాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో గిరిజనేతరులకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా హక్కులు కల్పిస్తారని ప్రశ్నించారు. గిరిజనులకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గిరిజనులను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే శిరీషాదేవిను గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, శాంతమ్మ, రాఘవయ్య, లక్ష్మణ్, వినోద్, జానకమ్మ, నర్సంహరావు, నాగేశ్వరావు, రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment