బాధిత కుటుంబానికికలెక్టర్ సాయం
పెదబయలు: పిడుగుపడి మృతి చెందిన కిల్లో నరసింగరావు(18) కుటుంబానికి కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పెదబయలు మండలం జామిగుడ పంచాయతీ జడిగుడ గ్రామానికి చెందిన కిల్లో నరసింగరావు గత ఏడాది ఆగస్టు 18న పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. మృతుడి తల్లితండ్రులు కిల్లో లివ్వు, తల్లి ఆల్మే మంగళవారం కలెక్టర్‌ను కలిసి జరిగిన సంఘటనను వివరించారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. జామిగుడ సర్పంచ్ తెరవాడ వెంకటరావు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment