‘యువత పోరు’ పోస్టర్ ఆవిష్కరణ
డుంబ్రిగుడ: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ అరకులోయ ఎమ్మెల్యే మత్స్యలింగం ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు పరశురాం ఆధ్వర్యంలో అరకుసంత గ్రామంలో మంగళవారం కార్యక్రమం పోస్టర్‌లను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ భృతి, వసతిదీవెన, విద్యా దీవేన పథకాలు ఇవ్వకుండా ప్రభుత్వం విద్యార్థుకు మోసగించిందన్నారు. నాయకులు బాకా సింహాచలం, చటారి కృష్ణారావు, అశోకుమార్, నాగేశ్వరరావు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నర్సింగ్‌రావు, గురునాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment