గిరిజన క్రీడాకారులకుఅభినందన
సాక్షి,పాడేరు: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన స్కూల్‌గేమ్స్‌లో ప్రతిభ చూపిన 15మంది గిరిజన క్రీడాకారులను కలెక్టర్ దినేష్‌కుమార్ మంగళవారం అభినందించారు.వివిధ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలను కలెక్టర్ అందజేశారు.రాష్ట్రస్థాయిలో హ్యాండ్‌బాల్ పోటీలో రెండవ స్థానం సాధించిన వనం గౌరీశంకర్,డిస్కస్‌త్రోలో తృతీయ స్థానం సాఽధించిన గుల్లెలు చంద్రశేఖర్‌నాయుడుకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీడీ రజనీ,అరకులోయ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ పి.ఎస్.ఎన్. మూర్తి,స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వండలం కొండబాబు,పలు పాఠశాలల పీడీలు సూరిబాబు, భూపతిరాజులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment