శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు
రాజవొమ్మంగి: గిరిజన రైతులు అధునాతన పద్ధతిలో సాగుపై అవగాహన కలిగి ఉండాలనిజాతీయ వాణిజ్య, వ్యవసాయ పరిశోధన సంస్థ (రాజమహేంద్రవరం), సీటీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్, ప్రిన్పిపల్ పరిశోధకులు సుమన్ కల్యాణి అన్నారు. వారు ఆధ్వర్యంలో మండలంలోని జడ్డంగి సచివాలం వద్ద మంగళవారం రైతు శిక్షణ కార్యక్రమం జరిగింది. గిరిజన ఉప ప్రణాళిక 2024–25 పథకంలో భాగంగా 50 మంది గిరిజన రైతులకు రూ.60వేల విలువైన ఎరువులు, రూ.16వేల విలువగల స్ప్రేయర్లను అందజేశారు. డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్, శాస్త్రవేత్త డాక్టర్ సుమన్ కల్యాణి మాట్లాడుతూ శాసీ్త్రయ పద్ధతుల సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. గతంలో సీటీఆర్‌ఐ కేవలం పొగాకు పంటపైనే పరిశోధనలు జరిపి రైతులను ఆ పంటలో ప్రోత్సహించేదన్నారు. ప్రస్తుతం సీటీఆర్‌ఐను జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థగా మార్పు చేసి పొగాకుతో పాటు జీడిమామిడి, పసుపు, మిర్చి, అశ్వగంధం, ఆముదం వంటి పంటల సాగుపై రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నామన్నారు. ఈ పంటల సాగులో రైతుకు విత్తనాలు, ఇతర అనేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పండిన పంటను వాల్యూ ఏడెడ్ కమోడిటీస్‌గా మార్చుకొనే విధనాలను శిక్షణ తరగతుల ద్వారా వివరిస్తున్నట్టు చెప్పారు. అలాగే పండించిన పంటకు మంచి మార్కెటు సదుపాయం కూడా కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గిరిజన మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనేలా అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. జడ్డంగి సర్పంచ్ కొంగర మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి, వైస్ సర్పంచ్ దుర్గ, ఎంపీటీసీ సభ్యురాలు అచ్చియమ్మ, వ్యవసాయపరపతి సంఘం మాజి అధ్యక్షులు తాతారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment