ఆరిలోవ(విశాఖ): జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్ద రైల్వే జోన్ పనులను మంగళవారం శ్రీకృష్ణాపురానికి చెందిన గిరిజనులు అడ్డుకున్నారు. ముడసర్లోవ ప్రాంతంలో 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేజోన్ కోసం కేటాయించిన సంగతి తెలిసిందే.ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ భూసార పరీక్షలు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పొక్లెయిన్ ద్వా రా పనులు జరగనివ్వకపోవడంతో కాంట్రాక్టర్ పను లు నిలిపివేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఈ భూములు రైల్వేకు కేటాయించారని, వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. 1976లో అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణాపురంలో 66 గిరిజన కుటుంబాలకు 66 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించిందని వారు తెలిపారు. ఆ భూమిని ఇప్పుడు రైల్వేకు కేటాయించడం అన్యాయమన్నారు. ఈ భూములు తీసుకున్నందుకు తమకు ప్రత్యామ్నాయం చూపాలని, అప్పటివరకు పనులు జరగనివ్వమని హెచ్చరించారు.
రైల్వే జోన్ పనులు అడ్డుకుని,
శ్రీకృష్ణాపురం గిరిజనుల ఆందోళన