సీలేరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఏప్రిల్ 1 వతేది నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ వి.శంకరరావు తెలిపారు. అనుభవం గల అధ్యాపకులచే డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాతీయ సేవా పథకం ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. కంప్యూటర్ కోర్సుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని, విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. పదో తరగతి హాల్‌టికెట్లు, రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు, మార్కులిస్టు పత్రం, కులధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుతో జతచేసి కళాశాల కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కళాశాలలో ప్రవేశాలకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు.