జి.మాడుగుల: మండల ప్రజా పరిషత్ నూతన అధ్యక్షుని ఎన్నిక గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రశాంతంగా జరిగింది. టీడీపీ అభ్యర్థి లంబూరి అప్పలరాజు ఎంపీపీగా ఎన్నికయ్యారు. మండల పరిషత్‌లో మొత్తం 13 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ సంఖ్యాబలం 7 ఉన్నప్పటికీ ప్రలోభాలతో ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కై వసం చేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు గైర్హాజరు కాగా, గతంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు అధికారి పార్టీ ప్రలోభాలతో మళ్లీ టీడీపీలో చేరారు. నిజానికి ఈ మండలంలో తొలుత మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏడింటిలో వైఎస్సార్‌సీపీ, ఏడింటిలో టీడీపీ, ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ మద్దతుతో అప్పట్లో టీడీపీ ఎంపీపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇండిపెండెంట్‌గా గెలిచిన కొర్రా పద్మకు ఎంపీపీగా అవకాశమిచ్చారు. ఒప్పందం ప్రకారం ఆమె రాజీనామా చేయడంతో గురువారం ఉప ఎన్నిక జరిగింది. 2021 స్థానిక ఎన్నికల తర్వాత ఒక టీడీపీ ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఒక వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ మరణించగా.. టీడీపీ ఎంపీటీసీ ఒకరు రాజీనామా చేశారు. దీంతో స్థానాల సంఖ్య 13కి తగ్గింది. ప్రస్తుత సంఖ్యాబలం వైఎస్సార్‌సీపీ 7 (టీడీపీ ఎంపీటీసీతో కలిపి)–టీడీపీ 6 (ఇండిపెండెంట్‌తో కలిపి). వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుడుముల సత్యనారాయణ ఎంపీపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరపున లంబూరు అప్పలరాజు నామినేషన్ వేశారు. అయితే గతంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన సొలభం ఎంపీటీసీ సభ్యుడు చిన్నారావుకు టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేయడంతో నాటకీయంగా మళ్లీ టీడీపీ గూటికి చేరాడు. ఇదికాక వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. దీంతో 11మంది సభ్యులే హాజరు కాగా టీడీపీకి ఏడు ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి లంబూరు అప్పలరాజు గెలిచినట్టు ప్రకటించారు. గైర్హాజరైన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు గబ్బాడి సన్యాసిదొర, అంగనైని నానాజీలు టీడీపీ ప్రలోభాలకు గురైనట్టు ప్రచారం జరుగుతోంది. సొలభం ఎంపీటీసీ సభ్యుడు చిన్నారావు తిరిగి టీడీపీలో చేరకుండా, ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరై వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి కుడుముల సత్యనారాయణకు సహకరిస్తే ఆయనే ఎంపీపీ అయ్యేవారు.
ఉప సర్పంచ్ పదవి వైఎస్సార్‌సీపీకే
జి.మాడుగుల మండలం గెమ్మెలి ఉప సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు, 14వ వార్డు సభ్యుడు కోటేశ్వరరావు కైవసం చేసుకున్నారు. సర్పంచ్‌తో సహా మెజార్టీ వార్డు సభ్యులంతా కోటేశ్వరరావుకు మద్దతిచ్చారు.
ప్రలోభాలతో గెలుచుకున్న టీడీపీ
జి.మాడుగుల ఎంపీపీగా లంబూరి అప్పలరాజు