జిల్లాలో గిరిపుత్రుల గొంతులెండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఊట బావులు, చలమల్లో నీరు ఎండిపోయింది. గ్రావిటీలు చుక్కనీరివ్వడం లేదు. కొన్ని చోట్ల బోర్లు, సోలార్ వాటర్ స్కీములు పనిచేయడం లేదు. తాగునీటి సమస్య రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో బిందెడు నీటి కోసం వారు మైళ్లకొద్దీ నడిచి వెళ్లవలసి వస్తోంది. గొంతు తడుపు కొనేందుకు గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్నారు. పాలకుల, అధికారుల నిర్లక్ష్య ధోరణి ప్రజలను నీళ్ల కష్టాల్లోకి నెట్టేసింది.
జల దారిలో..
కలుషిత ఊటనీటిని సేకరిస్తున్న కొమ్ములుకొండ మహిళలు
సాక్షి,పాడేరు/అరకులోయటౌన్/పాడేరు/ రంపచోడవరం: జిల్లాలోని వందలాది గ్రామాల్లో గిరిజనులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వేసవికి ముందే తాగునీటి సమస్య పరిష్కరిస్తామని పాలకులు,అధికారులు చేసిన ప్రకటనలు నీటి మూటలయ్యాయి. పలు గ్రామాల్లో తాగునీటి పథకాలతో పాటు గతంలో నిర్మించిన గ్రావిటి పథకాలు,ఇంటింటికీ వేసిన కుళాయిలు,బోరుబావులు సక్రమంగా పనిచేయకపోవడతో గిరిజనులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ అధికారులు నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో తాగునీటి పథకాలు,బోరుబావులు వినియోగంలోకి తేవాలని అర్జీలు ఇస్తున్నా వాటిని పరిష్కరించ లేదని గిరిజనులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి
నాలుగైదు గ్రామాలకు ఒక తాగునీటి పథకం మాత్రమే ఆధారమవుతోంది. పలు గ్రామాల మహిళలు మైళ్ల కొద్దీ నడిచి వెళ్లి గ్రామ శివారు ప్రాంతాలు, పక్క గ్రామాల నుంచి మండుటెండలో బిందెలతో నీటిని మోసుకుని రావలసిన దుస్థితి నెలకొంది.
● జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో తాగు నీటి పథకాలు పనిచేయక పోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలోని రామాలయం వీధిలో మంచినీటి పథకం మరమ్మతులకు గురికావడంతో ఆ వీధి వాసులు బిందెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. స్థానిక డీఆర్ డిపో ఆవరణలో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నీటి పథకం నుంచి రామాలయం వీధిలో ఇంటింటికీ కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేశారు. అది ఇటీవల మరమ్మతులకు గురైంది. దీంతో వీధిలో చేతి బోరును ఆశ్రయించాల్సి వస్తోంది. మండలంలో పలు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
● గూడెం కొత్తవీధి మండలంలో తాగునీటి పథకాలు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. దీంతో నీటి ఎద్దడి నెలకొంది. గెడ్డలు, వాగులు, చెరువుల్లోని కలుషిత నీరే ఆధారమవుతోంది.
● కొయ్యూరు మండలంలోని మారుమూల గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. సుమారు 30కి పైగా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎం.భీమవరం, యూ.చీడిపాలెం, బూదరాళ్ల పంచాయతీల్లో నీటి ఎద్దడి అధికంగా ఉంది. బోర్లు తవ్వేందుకు కొన్నిచోట్లకు రిగ్‌వాహనం వెళ్ల డం సాధ్యం కాదు.అలాంటి ప్రాంతాల్లో ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదు.కొయ్యూరు పంచాయతీలో మోటారు పాడైపోవడంతో నాలుగు రో జులనుంచి తాగునీరుసరఫరా కావడం లేదు.
● రంపచోడవరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.రంపచోడవరం ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో దేవీపట్నం, గంగవరం, రంపచోడవరం,మారేడుమిల్లి మండలాల్లో 252 మంచినీటి పథకాలు ఉన్నాయి.వీటిలో మారేడుమిల్లి మండలం వైదిపూడి, రంపచోడవరం మండలం సుద్దగొమ్మి గ్రామాల్లో తాగునీటి పథకాలు పనిచేయకపోవడంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు బోరు వేసి, మోటారు పెట్టి పైపు లైను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా లేనప్పుడు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తప్పడం లేదు. సుద్దగొమ్మి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్ కొంత కాలంగా పనిచేయడం లేదు. దీంతో ఆ గ్రామస్తులు 12 కిలోమీటర్ల దూరంలో గల గోకవరం నుంచి ఆటోలు, ద్విచక్ర వాహనాలతో నీటిని తెచ్చుకోవలసి వసో ్తంది.
● దేవీపట్నం మండలం కొండమొదలు కాలనీలో మంచినీటి పథకం నిర్మించినా అందరికీ పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగడం లేదు. తగిన సామర్థ్యంతో నీటి ట్యాంకు నిర్మించకపోవడమే కారణం. రంపచోడవరం, గంగవరం, మారేడుమిల్లి, రంపచోడవరం మండలాల్లో 1702 బోర్లు ఉన్నాయి. వీటిలో 1,669 బోర్లు పనిచేస్తున్నాయి.
● రాజవొమ్మంగి : మండలంలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సక్రమంగా తాగునీరు సరఫరా కావడం లేదని మండలవాసులు వాపోతున్నారు. వాతంగిలో మంచినీటి పథకం నిర్మించి, కుళాయిల ఏర్పాటు చేయకపోవడంతో మూడు వందల కుటుంబాల వారు చేతి పంపుపైనే ఆధారపడుతున్నారు. అదే పంచాయతీ కొమరాపురంలో రక్షిత మంచినీటి పథకం నిర్మాణం పూర్తయినప్పటికీ కుళాయిలకు నీటి సరఫరా ఇవ్వలేదు. హెచ్‌క్వార్టర్ అమీనాబాద్‌లో, ఏబీ కాలనీలో ట్యాంకుల నిర్మాణం పూర్తయినా వీధికుళాయిలకు నీరు రావడం లేదని మహిళలు తెలిపారు. దీంతో బోరు నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నట్టు చెప్పారు. అప్పలరాజుపేటలో రక్షిత మంచి నీటిపథకం కుళాయిలు పని చేయడం లేదు. దీంతో ఆ గ్రామస్తులు నీటికోసం అల్లాడుతున్నారు.
అధికారిక లెక్కలు ఇలా..
తాగునీటి పథకాలపునరుద్ధరణకు చర్యలు
మరమ్మతులకు గురైన జిల్లాలోని అన్ని తాగునీటి పథకాలు, బోరుబావుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం.కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు సకాలంలో పూర్తి చేసి తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం.
– జవహర్‌కుమార్, ఎగ్జిక్యూటివ్‌ఇంజినీర్, ఆర్‌డబ్లూఎస్, పాడేరు
గెడ్డ, ఊట నీరే దిక్కు
గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పలుమార్లు అధికారులకు సమస్యను వివరించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో గెడ్డ, ఊట నీటిని సేకరించి వినియోగిస్తున్నాం. కలుషిత నీటిని తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలి.
– పోయా దేవి, గిరి మహిళ,ఉరుములు, అరకులోయ మండలం
పథకాలు మూలకు చేరాయి
ఇరగాయి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. తాగునీటి పథకాలు మూలకు చేరాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలి.
– మాదల బుటికి, సర్పంచ్,
ఇరగాయి పంచాయతీ,
అరకులోయ మండలం
పోలవరంప్రాజెక్టు నిర్వాసిత కాలనీల్లో తాగు నీటిసరఫరా సక్రమంగా జరగడం లేదు. కొండమొదలు కాలనీలో అంతంత మాత్రంగా సరఫరా జరుగుతోంది. అధికారుల కు చెప్పినా పట్టించుకోవడం లేదు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం.
– కొండ్ల సురేష్‌రెడ్డి, కొండమొదలు కాలనీ, దేవీపట్నం మండలం
అధికారులకు
పట్టడం లేదు
ఇబ్బందులకు
గురవుతున్నాం
నిర్వాసిత కాలనీలో తీవ్ర ఇబ్బందులు
జిల్లాలోని 22 మండలాల పరిధిలో 4,860 గ్రామాలున్నాయి. గ్రామాల్లో తాగు నీటి సమ స్యను గుర్తించేందుకు ఇంతవరకు 4,370 గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు,ఎంపీడీవోలు,పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహించారు. మిగిలిన గ్రామాల్లో సర్వే జరపాల్సి ఉంది.ఈ సర్వేలో జిల్లా వ్యాప్తంగా 613 ఎంపీడబ్ల్యూ తాగునీటి పథకాలకుగాను 43 పథ కాలు, 2,237 పీడబ్ల్యూఎస్ పథకాలకు గాను 142 పథకాలు, 9,057 బోరు బావులకు గాను 1,340 పనిచేయడం లేదని నిర్ధారించారు. అయితే పనిచేయని పథకాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. జిల్లాలో సుమారు 300 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో నిర్మించిన తాగునీటి పథకాలు,బోరుబావులు వినియోగంలోకి వస్తే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు, మండల,డివిజన్,జిల్లా స్థాయి అధికారులకు విన్నవించుకుంటున్నారు.
మా గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. 50 కుటుంబాలకు ఒక మంచినీటి పథకం మాత్రమే ఉంది. ఆ పథకం కూడా మూలకు చేరడంతో బిందెడు నీటి కోసం మైళ్లదూరం వెళ్లాల్సి వస్తోంది. అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఊట గెడ్డల నుంచి కలుషిత నీటి తెచ్చుకుని వినియోగిస్తున్నాం.
–మజ్జి సుశీల, గుమ్మపుట్టు గ్రామం, డోకులూరు పంచాయతీ, పాడేరు మండలం.
మా గ్రామంలో 30 కుటుంబాలకు ఒక మంచినీటి పథకం ఉంది. వేసవి కావడంతో తాగునీరు సరిపడా సరఫరా కావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు.
– కిల్లో లక్ష్మి, చింతగొంది గ్రామం,
ఇరడపల్లి పంచాయతీ పాడేరు మండలం.
కన్నీటి ఊట
కన్నీటి ఊట
కన్నీటి ఊట
కన్నీటి ఊట
కన్నీటి ఊట