
నేటి నుంచి ఉదయం, సాయంత్రం ఓపీ సేవలు
మహారాణిపేట(విశాఖ): కేజీహెచ్‌లో మంగళవారం నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ తెలిపారు. అన్ని సూపర్ స్పెషాలిటీ అవుట్ పేషంట్ (ఓపీ) విభాగాలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయన్నారు. గతంలో సూపర్‌స్పెషాలిటీ ఓపీలు వారానికి మూడు రోజులు పనిచేసేవి. ఇప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు అన్ని రోజుల్లో ఓపీలు పనిచేస్తాయని వెల్లడించారు. రోగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.