
యుద్ధప్రాతిపదికనవించ్‌కు మరమ్మతులు
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో గల వించ్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు జరుగుతున్నాయి.1948లో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన సామగ్రిని,యంత్రాలను తరలించేందుకు రూ.60 లక్షల వ్యయంతో దీనిని ఏర్పాటు చేశారు. వించ్ స్టీల్ రోప్‌కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మరమ్మతులు చేస్తూ ఉంటారు.ప్రసుత్తం వించ్‌కు చెందిన ట్రాక్ చక్రాలు సక్రమంగా లేకపోవడంతో ప్రమాదమని భావించిన అధికారులు వించ్ ప్రయాణం నిలుపుదల చేశారు. మాచ్‌ఖండ్ ప్రాజెక్టు అధికారులు.. ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల జెన్‌కో అధికారులకు తెలియజేసి రూ. ఏడు లక్షలు మంజూరు చేయించారు. ట్రాక్ చక్రాలతో పాటు వించ్ ప్రయాణంలో ముఖ్యంగా వినియోగించే స్టీల్ రోప్‌ను సైతం పరిశీలించి,మరమ్మతులు చేస్తున్నారు.వించ్ మరమ్మతులతో ప్రాజెక్టులో విధులు నిర్వహించే అధికారులు,కార్మికులు ఘాట్‌రోడ్డులో 12కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నారు.దాదాపు రెండు వారాల పాటు వించ్ ప్రయాణం నిలిపివేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
రెండు వారాల పాటు
వించ్ ప్రయాణానికి బ్రేక్
రూ.7లక్షల వ్యయంతో పనులు
వించ్ మార్గంలో మరమ్మతు పనులు చేస్తున్న సిబ్బంది