
చిన్నారిని పరామర్శించిన ఎమ్మెల్యే మత్స్యలింగం
మహారాణిపేట: అరకు నియోజకవర్గం, హుకుంపేట మండలం, మర్రిపుట్టు గ్రామానికి చెందిన చుంచు అనిల్ కుమార్ కుమార్తె చుంచు సమీర అనారోగ్యంతో శనివారం కేజీహెచ్‌లో చేరింది. విషయం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కేజీహెచ్ భావనగర్ వార్డులో ఉన్న చిన్నారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం చిన్నారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ వైద్యులు రేణుక తదితరులు పాల్గొన్నారు.
సమీరను పరామర్శిస్తున్న
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం