● డిసెంబర్ 8 నుంచి 14 వరకు నిర్వహణ
సాక్షి, అనకాపల్లి: జిల్లావ్యాప్తంగా ఈ నెలాఖరున జరగాల్సిన నీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడినట్లు జిల్లా నీటి సంఘాల ఎన్నికల నోడల్ ఆఫీసర్, ఈఈ త్రినాథ్ తెలిపారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి 14 వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో 16 మేజర్, 28 మీడియం, 259 మైనర్ నీటిసంఘాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియకు డిసెంబర్ 5వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి.. 8వ తేదీన ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. 8న టీసీ మెంబర్, నీటి సంఘాల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు, 11న డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు, 14న ప్రాజెక్టు కమిటీ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment