‘గాదె’కు వ్యాయామ ఉపాధ్యాయుల మద్దతు
విశాఖ విద్య: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నా యుడుకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు వ్యాయా మ ఉపాధ్యాయుల అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విశాఖ, అన కాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల వ్యా యామ ఉపాధ్యాయ జిల్లా కమిటీల సమావేశం శనివారం రాత్రి పెందుర్తి సుజాతానగర్‌లోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. రాష్ట్ర అసోసియేషన్ సలహాదారు సుందరరావు మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడుకు ఉ త్తరాంధ్రలోని వ్యాయామ ఉపాధ్యాయ జిల్లా కమిటీలన్నీ ఏకగీవ్రంగా సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు. విశాఖ జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.అప్పలరాజు, ఎన్.లలిత్ కుమార్ ఆ ధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆరు జిల్లాల నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యా రు. ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై తనకు అవగాహన ఉందని, తనను గెలిపిస్తే వాటి పరిష్కారం కోసం శాసనమండలి వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎస్‌టీయూ జిల్లా కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment