శాసీ్త్రయ పద్ధతిలో చెత్త సేకరణ
● పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
● సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు
● స్వచ్ఛ దివస్‌లో కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: చెత్త సేకరణను ఆషామాషీగా తీసుకోవద్దని, ఈ ప్రక్రియ శాసీ్త్రయ పద్ధతిలో జరగాలని, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. తుమ్మపాల గ్రామంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తడి చెత్తను, పొడి చెత్తను విడదీసే విధానంపై అధికారులు స్థానికులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విషయంలో ప్రజలకు తగిన అవగాహన చేయాలన్నారు. ఇంటిని, పరిసరాలను, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో స్థానికుల సహకారం ఉండాలని, వారు స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి రోడ్డుపై చెత్తకుప్పలు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దుకాణదారులు, హోటళ్ల వారు చెత్తను డస్ట్‌బిన్‌లలో వేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యాపార సంస్థలను మూసివేయిస్తామని హెచ్చరించారు. వారం రోజులలో గ్రామంలో మొత్తం చెత్తకుప్పలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో షేక్ ఆయిషా, ఎస్డీసీ, మండల ప్రత్యేకాధికారి సుబ్బలక్ష్మి, డీపీవో ఆర్.శిరీషరాణి, జెడ్పీ డిప్యూటీ సీఈవో కె.రాజుకుమార్, ఎంపీడీవో కె.వి.నర్శింహరావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి నాగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి వి.ఈశ్వరరావు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
అనకాపల్లి: ఆరోగ్యంగా జీవించాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు వచ్చే సమయంలో తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని అన్నారు. గృహాల్లోను, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో చెత్త బుట్టలను ఏర్పాటు చేసి చెత్తను అక్కడ మాత్రమే వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ బి.అప్పారావు, ఏవో రామ్‌కుమార్, సీఐ టి.లక్ష్మి, ఎస్‌ఐలు సురేష్‌బాబు, వెంకన్న, కామేశ్వరరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
శాసీ్త్రయ పద్ధతిలో చెత్త సేకరణ
Comments
Please login to add a commentAdd a comment