ఇద్దరు కుమార్తెలకు తాను ఒక ఉదాహరణగా నిలవాలని ఫర్జానా నిర్ణయించుకున్నారు. కష్టం వచ్చినపుడు పోరాడాలని, ఎప్పుడూ వెనకడుగు వెయ్యకూడదని నిర్ణయించుకుని, ఆచరణలో చూపారు. సమస్యలు జీవితంలో నిత్యం వస్తుంటాయని, పోరాటం మానకూడదంటారు ఫర్జానా. నేను గెలవాలి అనే బలమైన ఆకాంక్ష సంపూర్ణ ఆరోగ్యంతో తయారయ్యేలా చేసిందన్నారు. నేడు ఎందరో క్యాన్సర్ బాధితులకు ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయక పాఠం. ఇటీవల ఆమె బాలకృష్ణ నిర్వహించే అన్‌స్టాపబుల్ షోలో కూడా పాల్గొని తన జీవిత ప్రయాణాన్ని, క్యాన్సర్‌ను జయించిన విధానాన్ని ప్రజలతో పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment