మునగపాక: మండలంలోని వాడ్రాపల్లికి చెందిన మతి స్థిమితం లేని వ్యక్తి శనివారం మునగపాకలో కత్తితో వీరంగం సృష్టించాడు. దీంతో పూడిమడక రోడ్డులో రాకపోకలు సాగించేవారు భయాందోళనకు గురయ్యారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాడ్రాపల్లికి చెందిన మతి స్థిమితం లేని వ్యక్తి మునగపాకలో చేపల అమ్మకందారులకు అడపాదడపా సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో కత్తితో హల్‌చల్ చేశాడు. సమాచారం మేరకు మునగపాక పోలీసులు అతడిని పట్టుకుని కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించడంతో వారు వచ్చి అతడిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment