కశింకోట: మండలంలో ఏఎస్ పేట గ్రామ సచివాలయంలో కంప్యూటర్ చోరీకి గురైంది. శుక్రవారం రాత్రి ఆగంతకులు సచివాలయ భవనం వెనుక భాగం తలుపులను బలంగా నెట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. అక్కడ ఉన్న కంప్యూటర్ సహా మూడు ఇన్వర్టర్ బ్యాటరీలను తస్కరించుకుపోయారు. ఉదయం సిబ్బంది సచివాలయానికి వెళ్లినప్పటికి లోపల వైపు గడియ వేసి మూసిన తలుపులు తెరచి ఉండటం, కంప్యూటర్, బ్యాటరీలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యారావు శనివారం తెలిపారు. వీటి ఖరీదు రూ.75 వేలు ఉంటుందన్నారు.
కంప్యూటర్, 3 ఇన్వర్టర్ బ్యాటరీల తస్కరణ
Comments
Please login to add a commentAdd a comment