25లోగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి
దేవరాపల్లి: జిల్లాలోని రైతులంతా ఈ నెల 25లోగా రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బి. మోహన్‌రావు సూచించారు. మండలంలోని కొత్తపెంట రైతు సేవా కేంద్రంలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను శనివారం ఆయన పర్యవేక్షించారు. మండలంలోని ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ ఎంత మేర పూర్తయిందని ఏవో వై. కాంతమ్మను అడిగి తెలుసుకున్నారు. మండలంలో శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రీ కోసం ప్రతీ రైతు ఆధార్, భూమి వన్‌బీ కాపీ, ఆధార్ లింక్‌తో ఉన్న ఫోన్ పట్టుకొని సమీప రైతు సేవా కేంద్రానికి వెళ్లాలని సూచించారు. రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తయిన రైతుకు ఐడీ నెంబర్ వస్తుందన్నారు. ఐడీ నెంబర్ ఉన్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, సున్నా వడ్డీ రాయితీలు, పంటల బీమా, బ్యాంక్ లోన్లు, యంత్ర పరిసరాలు తదితర పథకాలు వర్తిస్తాయన్నారు. రైతులు నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా రిజిస్ట్రీ ప్రక్రియను చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణాధికారి ఎస్. కిరణ్‌కుమార్, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తపెంటలో పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment