ముగిసిన జిల్లా స్థాయి డిగ్రీ విద్యార్థుల క్రీడా పోటీలు
చోడవరం రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి డిగ్రీ కళాశాల విద్యార్థుల క్రీడా పోటీలు వేడుకగా ముగిశాయి. ప్రిన్సిపాల్ పి.కిరణ్‌కుమార్ ప్రారంభించిన ఈ పోటీలు శుక్ర, శనివారాల్లో జరిగాయి. క్రికెట్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ప్రథమ, చోడవరం ఉషోదయ డిగ్రీ కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. వాలీబాల్‌లో విద్యార్థి కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు, ఖోఖోలో ప్రభుత్వ కళాశాల, ఉషోదయ కళాశాల మొదటి రెండు స్థానాలు కై వసం చేసుకున్నాయి. వంద మీటర్ల పరుగు పందెంలో ఎస్.గాయత్రి ప్రథమ, జి.మోహిని, ఆర్.మానస ద్వితీయ స్థానాల్లో, బాలురు పరుగు పోటీలో బి.శివ, జి.సాయిదుర్గ, ఇ. మనీష్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. విజేత విద్యార్థులను ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఐ.వి.వి. సత్యవతి, ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు డి.మాల్యాద్రి, బి.పిచ్చమ్మ, సీనియర్ ఉపన్యాసకులు సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment