75 కిలోల గంజాయి స్వాధీనం
రోలుగుంట: మండలంలో కొంతలం– వడిప గ్రామాల మార్గమధ్యంలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 కిలోల గంజాయిని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ రామకృష్టారావు వివరాల ప్రకారం.. మండలంలో లువ్వసింగు గ్రామానికి చెందిన కొర్రా నవీన్‌తోపాటు ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలం పూరణటిక్ పోదూర్ గ్రామానికి చెందిన ఖిలా సోమనాథ్ కొంతలం– వడిప గ్రామాల మధ్య జీడితోటలో 75 కిలోల గంజాయి నిల్వ ఉంచారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. గంజాయితోపాటు రెండు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో విక్రయించడానికి సిద్ధ మవుతుండగా పట్టుబడ్డారు. దీని విలువ రూ.3.75 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల పాటు రిమాండ్ విధించారని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment