అనకాపల్లి టౌన్: స్థానిక భోగలింగేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు పేరూరి చిన్నిస్వామి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. దేవతామూర్తుల అలంకరణ విభాగంలో ఈ పురస్కారం అందిస్తున్నట్టు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ (హైదరాబాద్) శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 16న చిన్ని స్వామి హైదరాబాద్‌లో ఈ అవార్డును అందుకోనున్నారని, గత 27 సంవత్సరాలుగా స్వయంభూ భోగలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా సేవ చేసినందుకు ఈ అవార్డు వచ్చిందని ఆలయ సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment