ఇంకుడు గుంతలకుప్రభుత్వ ప్రోత్సాహం
కె.కోటపాడు: ఇంటి పరిసరాల్లో మురుగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని డ్వామా పీడీ పూర్ణిమా దేవి అన్నారు. కె.కోటపాడు గ్రామంలో శనివా రం ఇంకుడు గుంతల నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఇంకుడు గుంతల వాడకం వలన భూగర్బ జలాలు మెరుగు పడనున్నట్లు తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టుకునే వారికి రూ.6,500లు ఇవ్వనున్నట్లు పూర్ణిమాదేవి చెప్పారు. అనంతరం కె.సంతపాలెం గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. సంపద తయారీ కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువు తయారీని చేపట్టి రైతులకు తక్కువ ధరకే అందించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఏపీడీ బి.శ్రీనివాసరావు, ఏపీవో అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment