యువతి అదృశ్యంపై ఫిర్యాదు
యలమంచిలి రూరల్ : పట్టణంలోని శేషుకొండ కాలనీకి చెందిన రంగాల లోవరాజు కుమార్తె రాజేశ్వరి(18) అదృశ్యమైనట్టు తండ్రి లోవరాజు ఆదివారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృత్తి రీత్యా గీత కార్మికుడైన లోవరాజు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో కల్లు అమ్ముకునేందుకు వెళ్లాడు. అర్ధగంట తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె కనిపించలేదు. తర్వాత ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ కె. సావిత్రి విలేకరులకు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివిన రాజేశ్వరి ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment