40 ఏళ్ల తరువాత మళ్లీ కలిశారు..
అనకాపల్లి : ఏరా మిత్రమా... ఏమి చేస్తున్నావు.. బాగున్నావా.. పిల్లలు ఎలా ఉన్నారు... అంటూ ఏఎంఎఎల్ కళాశాల 1981–84 డిగ్రీ పూర్వ విద్యార్థులు ఒకరి నొకరు పలకరించుకున్నారు. 40 ఏళ్ల క్రితం కళాశాలలలో నాటి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సమేతంగా స్ధానిక రింగ్‌రోడ్డు సన్‌క్యాస్ట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సమావేశమయ్యారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వపు డిగ్రీ విద్యార్థులంతా తిరిగి ఒక్కచోట కలుసుకోవడంతో ఆనందం వెల్లివిరిసింది. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆనాటి అధ్యాపకులను గుర్తు చేసుకున్నారు. కుటుంబ సమేతంగా వివిధ రకాలైన ఆటలపోటీల్లో పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో సరిసా శ్రీనివాసరావు, కొట్టారు రంగబాబు, వేగి వెంకటరావు, కాళ్లకూరి శ్రీనివాస్, విల్లూరి రెడ్డమ్మ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment