● మార్చి 24, 30న రెండు టీ–20 మ్యాచ్‌లు ● ఊపందుకున్న స్టేడియం ఆధునికీకరణ పనులు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ మ్యాచ్‌లకు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియం మరోసారి వేదిక కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి హోమ్ పిచ్‌గా వైఎస్సార్ స్టేడియాన్ని ఎంచుకోవడంతో ఆధునికీకరణ పనులు వేగవంతమయ్యాయి. మొత్తంగా స్టేడియం ఎలివేషన్ మారిపోనుండగా, కార్పొరేట్ బాక్సులు, ఆటగాళ్ల గ్రీన్ రూంల్లోనూ ఆధునిక వసతుల కల్పన చకచకా సాగిపోతోంది. స్టేడియంలోని స్టాండ్స్‌లో కుర్చీలను కూడా ఏసీఏ మారుస్తోంది. దీంతో వైఎస్సార్ స్టేడియం సరికొత్త రూపుతో ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో హోమ్ పిచ్‌గా విశాఖ స్టేడియాన్ని ఎంచుకుందని, ఈ సీజన్‌లోనూ రెండు మ్యాచ్‌లకు వేదిక కానుందన్నారు.
మార్చి 24న డీసీతో ఎల్‌ఎస్‌జీ ఢీ
ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తలపడనుంది. రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మార్చి 30న ఢిల్లీ క్యాపి టల్స్ జట్టు గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ జట్టు తరఫున స్థానిక ఆటగాడు నితీష్‌కుమార్ బరిలోకి దిగనుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment