జనారణ్యంలోకి జింక
కొమ్మాది: ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఆహార కొరత.. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల బోరవానిపాలెం, ఎండాడ ప్రాంతాలకు వచ్చిన రెండు జింకలు మృతి చెందగా, 10 రోజుల కిందట ఎండాడలో కుక్కల దాడిలో మరో జింక మృతి చెందింది. ఆదివారం ఓ జింక ఎండాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చేసింది. కదల్లేని స్థితిలో ఉన్న జింకను స్థానికులు ప్రథమ చికిత్స అందించి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకుని.. వైద్య చికిత్స నిమిత్తం జింకను కంబాల కొండకు తరలించారు. కాగా.. కంబాల కొండలో సరైన రక్షణ లేకపోవడం వల్ల జింకలు ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయి. జింకలు వరసగా మరణిస్తున్నప్పటికీ అటవీ శాఖ, జూ సిబ్బంది పట్టించుకోవడం లేదని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనారణ్యంలోకి జింక
Comments
Please login to add a commentAdd a comment