తల్లి చెంతన పూరీ జగన్నాథ్
నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోదరుడు, ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తల్లి సత్యవతి అలియాస్ అమ్మాజీ వద్దకు వచ్చారు. ఇటీవల ప్రమాదానికి గురికావడంతో ఆమె చేతికి ఆపరేషన్ జరిగింది. విషయం తెలియడంతో సోదరుడు, సినీ హీరో సాయిరామ్ శంకర్‌తో కలిసి పూరీ జగన్నాథ్ తల్లిని చూసేందుకు ఆదివారం గణేష్ ఇంటికి చేరుకున్నారు. తల్లిని అక్కున చేర్చుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చాలా కాలం తర్వాత కుమారుడిని చూసిన తల్లి అమ్మాజీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోదరులు గణేష్, సాయిరామ్, మరదళ్లు, పిల్లలు, తల్లితో జగన్నాథ్ సరదాగా గడిపారు. పూరీ రాకతో గణేష్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. పూరీ జగన్నాథ్ అభిమానులు, బంధువులు ఆయనను కలిసేందుకు తరలివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment