క్రిమినల్ కేసులు బనాయించి మరీ తొలగించారు..
నేను ఎటువంటి అవకతవకలకు పాల్పడకపోయినా కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే అన్యాయంగా తొలగించారు. హోంమంత్రి వంగలపూడి అనిత అప్పటి డ్వామా పీడీ సందీప్‌పై ఒత్తిడి తెచ్చి మరీ నాపై వేటు వేశారు. ఆయనతో మాకు ఫోన్ చేయించి రాజీనామా చేయాలని చెప్పించారు. నేను చేయనని చెప్పాను. నాపై క్రిమినల్ కేసులు పెట్టి మరీ తొలగించారు. 16 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. నాతోపాటు నామవరం, శ్రీరాంపురం ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా భయ పెట్టి తొలగించారు. మిగతా వారిని మరో నెల రోజుల తరువాత సాగనంపారు. నిజంగా నేను తప్పు చేస్తే.. అదే మస్తరు షీటుపై సంతకాలు చేసే ఎంపీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అధికారి, ఏపీఓ, డ్వామా పీడీ, టెక్నికల్ అసిస్టెంట్ అంద రూ తప్పు చేసినట్లే. వారిని కూడా తొలగించా లి. ఇదే వృత్తి మీద ఆధారపడి జీవించే మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జిల్లాలో 50 మందికిపైగా మేట్లను అక్రమంగా తొలగించారు.
– మేకా సోమయ్య, ఫీల్డ్ అసిస్టెంట్, ఈదటం గ్రామం, పాయకరావుపేట నియోజకవర్గం
గ్రూప్‌లో మెజారిటీ ఉన్నా.. మేట్‌గా రిజిస్టర్ చేయలేదు
మా గ్రూప్‌లో 50 మంది ఉపాధి కూలీలున్నారు. 25 మంది కన్నా ఎక్కువగా కూలీలు మద్దతుంటే మేట్‌గా రిజిస్టర్ చేయాలి. నాకు 30మందికి పైగా కూలీల మద్దతు ఉంది. అయినా మేట్‌గా రిజిస్టర్ చేయలేదు. ఇలా 7 గ్రూపుల్లో నిబంధనలకు విరుద్ధంగా మేట్లను నియమించారు. అధికారులు నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉద్యమిస్తాం.
– అడిగర్ల అప్పలనాయుడు,
మామిడపాలెం గ్రామం, మాకవరపాలెం
క్రిమినల్ కేసులు బనాయించి మరీ తొలగించారు..
Comments
Please login to add a commentAdd a comment