సరుగుడులో సండే సందడి
నాతవరం: సరుగుడు జలపాతం వద్ద ఆది వారం సందర్శకులతో సందడి నెలకొంది. ఎత్తయిన రెండు కొండల మధ్యలోంచి ప్రవహించే నీటిలో జలకాలు ఆడేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు. అనకాపల్లి, కాకినాడ జిల్లాల నలుమూలల నుంచి వాహనాలపై అధికంగా సందర్శకులు రావడంతో జలపాతం వద్ద ఉదయం నుంచి సాయంత్రం కోలాహలం కన్పించింది. ఆటపాటలతో సందర్శకులు కాలక్షేపం చేసి మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేశారు. సందర్శకులు పెద్ద ఎత్తున కార్లు, ద్విచక్ర వాహనాలపై రావడంతో సరుగుడు వెళ్లే రోడ్డులో రద్దీ కనిపించింది.
యారాడలో ‘కింగ్‌డమ్’
కొమ్మాది: విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో పాన్ ఇండియాలో తెరకెక్కుతోన్న కింగ్‌డమ్ చిత్రం షూటింగ్ ఆదివారం యారాడ బీచ్‌లో జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ సందడి నెలకొంది. హీరో విజయ్ దేవకొండపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
న్యూస్‌రీల్
పార్ట్‌టైం పీఈటీ అరెస్ట్
పోక్సో కేసు నమోదు
గొలుగొండ: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన చోద్యం జెడ్పీ హైస్కూల్ మాజీ పార్టుటైం పీఈటీ కందూరు నూకరాజుపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కృష్ణదేవిపేట ఎస్‌ఐ తారకేశ్వర్రావు తెలిపారు. ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యార్థినులతో పీఈటీ నూకరాజు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించామని తెలిపారు. నూకరాజును విద్యాశాఖ అధికారు లు శనివారం విధుల నుంచి తొలగించగా.. ఆదివారం విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
సరుగుడులో సండే సందడి
Comments
Please login to add a commentAdd a comment