ఉపాధిలోనూ రాజకీయమే..!
ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఉపాధి పనుల్లో రాజకీయ జోక్యం రోజురోజుకు పెరిగిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌పై అవినీతి ఆరోపణలు వస్తే థర్డ్ పార్టీ విచారణ, క్వాలిటీ కంట్రోల్ ఎంకై ్వరీ చేయాలి. అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైతే అప్పుడు నిబంధనల ప్రకారం సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. క్రిమినల్ కేసులు బనాయించడం, అక్రమంగా తొలగించడం, బెదిరింపులకు పాల్పడి వారంతట వారే రాజీనామా చేసేలా భయపెట్టడం వంటి వాటికి పాల్పడుతున్నారు. ఎక్కువమంది కూలీలు మద్దతు ఇచ్చిన వారే మేట్‌గా ఉండాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా డ్వామా అధికారులు మేట్లను తొలగించి, వారికి అనుకూలమైన వారిని వేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment