బేడ జంగం కులస్తులకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి
అనకాపల్లి: రాష్ట్రంలో బేడ(బుడ్గ) జంగం కులస్తుల విద్యార్థులకు 17 సంవత్సరాలుగా కుల ధృవీకరణ(ఎస్సీ) పత్రాలను ప్రభుత్వం అంజేయడం లేదని, జేసీ శర్మ కమిషన్ నివేదిక ప్రకారం కుల ధృవీకరణ పత్రాలను అందజేయాలని ఏపీ బేడ(బుడ్గ) జంగం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు దుడ్డు కొండయ్య అన్నారు. స్థానిక జార్జి క్లబ్ ఆవరణలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బేడ జంగం కలస్తుల విద్యార్థులకు ఎస్పీ కుల ధృవీకరణ పత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో అందజేసేవారని, ప్రస్తుతం అందజేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 17 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందజేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. సుప్రీంకోర్టులను ఆశ్రయించడంతో గతంలో ఉన్నట్టుగా కుల ధృవీకరణ పత్రాలను అందజేయాలని జెసీ శర్మ కమిషన్ సిఫారసలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా ఉపాధ్యక్షుడు పి.అప్పారావు, కార్యదర్శి శేర్ల అప్పారావు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment