ఎమ్మెల్సీ అభ్యర్థి ‘గాదె’ విస్తృత ప్రచారం
బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న గాదె శ్రీనివాసులునాయుడు
డుంబ్రిగుడ: ఎమ్మెల్సీగా మరోసారి తనను గెలిపిస్తే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలుకు కృషి చేస్తానని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ బాలుర, బాలికల, కేజీబీవీ, డుంబ్రిగుడ, అరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన ఆయా పాఠశాలల బయట ఉపాధ్యాయులతో మాట్లాడారు. కేజీబీవీలలో పని చేస్తున్న సీఆర్‌టీలకు మినిమం టైం స్కేల్ వర్తించేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా బీమా సదుపాయం కల్పించి ఉపాధ్యాయులకు వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయులకు 15 రోజుల సాధారణ సెలవులపై స్పష్టతనిచ్చి అమలయ్యేలా చూస్తామన్నారు. పీఆర్‌టీయూ అల్లూరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గిరి, అప్పలరాజు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, రాష్ట్ర కౌన్సిలర్ జి.గెన్ను, జల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్ష, కార్యదర్శి లక్ష్మయ్య, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment