20 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు
చీడికాడ : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ బి.సతీష్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మండలంలోని అప్పలరాజుపురం కాటా వద్ద ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీలు నిర్వహిహిస్తుండగా తమిళనాడుకు చెందిన మహమ్మద్ అర్షప్, టి.ఏబారిన్ అనే వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారన్నారు. వీరిద్దరూ ముంచుంగుపుట్టు మండలంలో ఒక వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్టు విచారణలో తెలిసిందన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment