కశింకోట : తాళ్లపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. అనకాపల్లి –యలమంచిలి మార్గంలో జాతీయ రహదారిపై తాళ్లపాలెం సమీపంలో మామిడివాక గెడ్డ వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తిని వ్యాన్ వేగంగా ఢీకొందన్నారు. దీంతో తల నుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. నేరేడు పండు రంగు షర్టు, నలుపు రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడన్నారు.
వీఆర్‌వో రాయవరపు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment