అనకాపల్లి : శ్రీ భాగవతుల చాత్తాడ శ్రీవైష్ణవ సేవా సంఘం జిల్లా అధ్యక్షునిగా నీలాచలం వెంకటరమణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక గాంధీనగరం సంఘం కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా తిరుపతి గౌరసోమశేఖర్, కోశాధికారిగా సన్నిధి ఈశ్వరరావు, గౌరవాధ్యక్షునిగా ఎం.జగన్‌మోహన్‌రావుతో పాటు మరో 15మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.జగన్‌న్‌మోహన్‌రావు మాట్లాడుతూ పై కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చే స్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment