కొత్త దద్దుగుల గ్రామస్తుల ఆశ్చర్యం
ఆ గ్రామం వెళ్లిన మొదటి కలెక్టరు విజయకృష్ణన్
నెల రోజుల్లో గ్యాప్ ఏరియా భూముల సర్వే
గ్రామాన్ని ఆనుకుని వృధాగా ఉన్న వేలాది ఎకరాల గ్యాప్ ఏరియా భూములను కలెక్టర్ పరిశీలించారు. ఈ భూములు సర్వే చేసి రికార్డులో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. నెల రోజుల్లో గ్యాప్ ఎరియా భూములు మొత్తం సర్వే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలని మండల సర్వేయరు ప్రసాద్‌ను అదేశించారు. జిల్లాల సరిహద్దు విషయంలో ప్రత్యేక దృష్టి సారించి అధునిక టెక్నాలజీ సహాయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో రమణ, నర్సీపట్నం రేంజర్ లక్ష్మి నర్సు, అటవీ సెక్షన్ అధికారి చిరంజీవి, తహసీల్దార్ ఎ.వేణుగోపాల్ పాల్గొన్నారు.
మా ఊరికి
కలెక్టరమ్మ వచ్చింది...
నాతవరం: కొత్తదద్దుగుల గ్రామాన్ని కలెక్టరు విజయకృష్ణన్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సుందరకోట పంచాయతీ శివారు కొత్త దద్దుగుల గ్రామానికి ఒక కలెక్టరు రావడం ఇదే మొదటిసారి. దీంతో ఇక్కడి గిరిజనులు ఆశ్చర్యంగా చూశారు. గ్రామం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఏ కలెక్టరూ ఆ గ్రామానికి వచ్చిన సందర్భాలు లేవు. ఈ గ్రామం రెండు జిల్లాల సరిహద్దు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతోమండల స్థాయి అధికారులు సైతం వెళ్లిన దాఖలాలు అంతంత మాత్రమే. ఈ ప్రాంతాన్ని ‘గ్యాప్ ఏరియా’గా పరిగణిస్తారు. గ్రామంలో పరిస్థితులను స్వయంగా చూసి కలెక్టరు గిరిజనులతో మాట్లాడారు. జీవన విధానం, సంక్షేమ పథకాల అమలుతో పాటు సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం, అంగన్‌వాడీ కేంద్రం, తాగునీరు, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. గ్రామానికి రోడ్డు లేక గర్భిణులను వైద్యానికి తీసుకెళ్లం ఇబ్బందిగా ఉందని గిరిజనులు కలెక్టర్ వద్ద వాపోయారు. ఉపాధి హమీ పథకంలో వేసిన మట్టి రోడ్డు వర్షాలకు కోట్టుకుపోవడంతో రాకపోకలు సాగించలేక పోతున్నామన్నారు. సెల్ టవరు ఏర్పాటు చేస్తే కొండల మీద ఉన్న గిరిజన గ్రామాల ప్రజలకు ఆన్‌లైన్ సేవలు అందుతాయన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులందరికీ అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. పాడేరు ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం కల్పించే సదుపాయాలు ఇక్కడ తమకు అందించాలని కోరారు. గతంలో ఇచ్చేవారని ఇటీవల కాలంలో ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం జాఫ్రా పంట ఆదాయం బాగుందని, కేజీకి రూ.250లకు విక్రయాలు ప్రైవేటు వ్యాపారులు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది ఈ ఒక్క పంటే అదాయం వస్తుందన్నారు. దీంతో గిరిజనుల మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని ఎంపీడీవో కె.ఉషాశ్రీని కలెక్టర్ ఆదేశించారు. కొండల మీద ఉన్న గిరిజన గ్రామాల్లో పాఠశాలల పని తీరుపై ఎంఈవోలు సత్యనారాయణ, కామిరెడ్డి వరహాలబాబును అడిగారు.
రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్
నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, బంగారయ్యపేటలో జరుగుతున్న భూముల రీసర్వేను జిల్లా కలెక్టర్ విజయ్‌కృష్ణన్ సోమవారం పరిశీలించారు. అధికారులు సర్వే చేస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇస్తున్నారా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సర్వే చేస్తున్నప్పుడు రైతులు దగ్గర ఉండి సర్వే చేయించుకోవాలన్నారు. లోటుపాట్లు లేకుండా సర్వేను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రమణ ఉన్నారు.
మీరు ఫిర్యాదు చేస్తే
నేను పట్టించుకోవాలా?
గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ
కొత్త దద్దుగుల గ్రామస్తుల ఆశ్చర్యం
Comments
Please login to add a commentAdd a comment