నెలాఖరులోగా ఆనకట్ట పూర్తి చేయాలి..
బుచ్చెయ్యపేట : మండలంలో గల మంగళాపురం ఆనకట్ట నిర్మాణ పనులను వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతు సంఘ నాయకులు పరిశీలించారు. తొంభై శాతం పనులు పూర్తవగా మిగిలిన పనులు నెలాఖరులోగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మూడేళ్ల కిందట మంగళాపురం ఆనకట్ట భారీ వర్షాలకు దెబ్బతింది. ఆనకట్ట దిగువన ఉన్న మంగళాపురం, కుముదాంపేట, విజయరామరాజుపేట, లక్ష్మీపురం, సురవరం, నరసయ్యపేట తదితర గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులకు సాగు నీరు అందలేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఆనకట్ట దెబ్బతినడంతో కోనాం రిజర్వాయర్ నీరు అందక రైతులకు తీవ్ర నష్టం జరిగేది. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు విజయరామరాజుపేట, మంగళాపురం సర్పంచ్‌లు ఎల్లపు విజయ్‌కుమార్, కంటే పద్మరేఖ వెంకట్, కోఆపరేటివ్ అధ్యక్షుడు ఎల్లపు గోవిందలు పలువురు నాయకులు, రైతులతో కలిసి సాగు నీటి కష్టాలను అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దృష్టికి తీసుకెళ్లారు. ధర్మశ్రీ కృషితో అనకాపల్లి ఎంపీ బి.వి.సత్యవతి మంగళాపురం ఆనకట్ట మరమ్మతు పనులకు తన ఎంపీ నిధుల నుంచి రూ.40 లక్షలు మంజూరు చేశారు. 2023 నవంబర్ 21వ తేదీన అప్పటి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండల నాయకులతో కలిసి ఆనకట్ట పనులకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికే ఆనకట్ట నిర్మాణ గోడ ఎఫ్రాన్‌తో పాటు రక్షణ గోడ పనులు, రాతి పేర్పు పనులు జరగ్గా వీటి నాణ్యత సామర్‌ాధ్యన్ని విజయరామరాజుపేట, మంగళాపురం సర్పంచ్‌లు విజయ్‌కుమార్, పద్మరేఖ వెంకట్, కోఆపరేటివ్ మాజీ అధ్యక్షుడు గోవింద, రైతు సంఘ నాయకులు సోమవారం పరిశీలించారు. 3 వేల ఎకరాలకు సాగు నీరందించే ఆనకట్ట పనులు పటిష్టంగా పూర్తి చేయాలన్నారు. ఆనకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ సత్యవతి,ఎమ్మెల్యే ధర్మశ్రీకి నాయకులు,రైతు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పేట ఉప సర్పంచ్ దొడ్డి జగన్నాధరావు, పీఎసీఎస్ మాజీ డైరెక్టర్ పెంటకోట కృష్ణ రైతు సంఘ నాయకులు ఎల్లపు చిరంజీవి, వేగి అప్పారావు, గాడి ప్రసాద్, మధుమంతి నాయుడు, పత్తి జగన్నాథరావు, వేగి రాజు పాల్గొన్నారు.
మంగళాపురం ఆనకట్ట పనులను పరిశీలించిన
వైఎస్సార్‌సీపీ నాయకులు
గత ప్రభుత్వంలో రూ.40 లక్షలు నిధులు మంజూరు
నెలాఖరులోగా ఆనకట్ట పూర్తి చేయాలి..
నెలాఖరులోగా ఆనకట్ట పూర్తి చేయాలి..
Comments
Please login to add a commentAdd a comment