పోలీసు సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
● సమీక్ష సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా
ఎస్పీ కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి : స్థానిక ఎస్పీ కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బందితో (సెక్షన్ వైస్) సోమవారం సమీక్ష సమావేశాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. పోలీస్ సిబ్బంది అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ, సంక్షేమ పథకాలు, సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉద్యోగుల్లో స్ఫూర్తిని పెంచేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని, సమర్ధంగా సేవలు అందించేందుకు తగిన మార్గదర్శకాలు, నూతన విధానాలు, సాంకేతిక వినియోగం వంటి అనేక అంశాలపై సిబ్బందితో ఎస్పీ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఏవో ఎ.రామ్‌కుమార్, సెక్షన్ సూపరింటెండెంట్‌లు కె.వి.వరలక్ష్మి, పి.శేషు, ఎన్.వి.గిరిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment