రిజర్వ్ బ్యాంక్ పేరుతో మోసాలు
● ముగ్గురు ముఠా సభ్యుల అరెస్ట్ ● పరారీలో ప్రధాన నిందితుడు
గోపాలపట్నం: రిజర్వ్ బ్యాంక్ ద్వారా కోట్లాది రూపాయలు, విల్లాలు ఇప్పిస్తామని.. రూ.5 వేలు కడితే కోటి వరకు నజరానా వస్తుందని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను సోమవారం టాస్క్‌ఫోర్స్, ఎయిర్‌పోర్టు పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. రెండు రాష్ట్రాల్లో ఓ ముఠా రైస్ పుల్లింగ్, రిజర్వ్ బ్యాంక్ సర్టిఫికెట్లు వంటి పలు రకాల మోసాలకు పాల్పడుతోంది.
ఇందులో కొందరు ముఠా సభ్యులు విశాఖలో ఉన్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మర్రిపాలెం వుడా లేఅవుట్ పార్క్ సమీపంలో ఒక ఇంటిపై దాడి చేశారు. విశాఖకు చెందిన లక్ష్మీ ప్రసన్న, కోటేశ్వరరావు, కాకినాడకు చెందిన శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన యడ్లపల్లి నారాయణ మూర్తి పరారయ్యాడు. వీరు గతంలో పలు చోట్ల దొంగ నోట్లు చలామణి చేయడం, రూ.5వేలు, రూ.10 వేలు కడితే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డారు.
వీరు విశాఖ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలను అడ్డాగా మార్చుకుని ప్రజలను ఏమార్చుతున్నారు. కాగా.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ పేరుతో మోసాలు
రిజర్వ్ బ్యాంక్ పేరుతో మోసాలు
Comments
Please login to add a commentAdd a comment