కక్ష సాధింపులకు పాల్పడితే సహించం
నర్సీపట్నం : రాష్ట్రంలో బహుజన అధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని బహుజన ఐక్యవేదిక నాయకులు బొట్టా నాగరాజు పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు బహుజన అధికారి అయిన సీఐడీ చీఫ్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్‌కుమార్‌పై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పోస్టింగ్ ఇవ్వాకుండా ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. అట్టడుగు వర్గాల సమాజం బాగుపడాలని నిరంతరం కృషి చేస్తున్న పి.వి.సునీల్ కుమార్‌పై కక్ష కట్టి ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.అధికారులు రాజ్యాంగానికి లోబడి ఉద్యోగాలు చేస్తారన్నారు. అలాంటివారిని ఇబ్బందులు పెడితే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టేనన్నారు. పి.వి సునీల్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ పోలీసు అధికారిగా ఎన్నో అవార్డులు అందుకున్నారన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ వేధింపులు ఆపి పోస్టింగ్ ఇవ్వాలన్నారు. లేని పక్షంలో బహజనులంతా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సాగిస్తామన్నారు. ఇదే ధోరణి కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక నాయకులు ఎన్.చిరంజీవి, వి.సంజీవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment