● ప్రభుత్వ భూముల ఆక్రమణపై ఫిర్యాదు చేసిన వారిపై తహసీల్ద
గొలుగొండ : గొలుగొండ తహసీల్దార్ శ్రీనివాసరావు తీరుపై నాగాపురం పంచాయతీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన నాయకులు, ప్రజలపై తహసీల్దార్ మండిపడ్డారు. మీరు ఫిర్యాదు లు ఇస్తే నేను పట్టించుకోవాలా.. నేను ఎటువంటి చర్యలు తీసుకోను? ఎం చేసుకుంటారో చేసుకోండి అని తెగేసి చెప్పడంతో హతాశులైన గ్రామస్తులు తహసీల్దార్ తీరును నిరసిస్తూ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహసీల్దార్ డౌన్..డౌన్ అని నినదించారు. నాలుగు గంటల పాటు కార్యాలయం మెట్లపై ఆందోళన చేశారు.
వివరాలివీ...
నాగాపురం పంచాయతీ శివారు పల్లావూరు గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ఉంది. అక్కడే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయం ఉంది. అక్కడ ప్రజలకు ఇపయోగపడే విధంగా మరో 10 సెంట్లు స్థలం ఉంది. దీనిని పల్లా దేముడు అనే వ్యక్తి ఆక్రమించాడని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని పలువురు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే తహసీల్దార్ వారిపై మండిపడ్డారు. మాజీ సర్పంచ్ కొలగాన రామారావు, ప్రస్తుతం సర్పంచ్ యలమంచిలి రఘురాంతోపాటు అన్ని పార్టీల నేతలు ఇక్కడకు వచ్చారు. తహసీల్దార్ ఆక్రమణదారులకు వత్తాసు పలకడంపై ఫిర్యాదుదారులు ఆందోళన చేశారు. గొలుగొండ ఎస్‌ఐ రామారావు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని ఆందోళనకారులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment