ఎస్‌ఈజెడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన
● పెడిమికొండ అటవీ ప్రాంతంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భూముల అన్వేషణ ● గాంధీనగరం పరిసరాల్లో పర్యటించిన అనకాపల్లి, అల్లూరి కలెక్టర్లు
నాతవరం: గాంధీనగరం సమీపంలో ఎస్‌ఈజెడ్ ఏర్పాటు కోసం 100 ఎకరాల భూ సేకరణలో భాగంగా పెడిమికొండ అటవీ ప్రాంతాన్ని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ సోమవారం పరిశీలించారు. నర్సీపట్నం–తుని మధ్య ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపుల గాంధీనగరం సమీపంలో 3 కిలోమీటర్ల వరకు పెడిమికొండ అటవీ భూములు ఉన్నాయి. ఆ భూములను అటవీశాఖ అధికారుల తో కలిసి ఇద్దరు కలెక్టర్లు స్వయంగా పరిశీలించి వా టి వివరాలను తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో కొంతమేర పెడిమికొండ నర్సరీ, మరికొంత భూ మిలో జీడిమామిడి తోట ఉందని అటవీ రేంజర్ లక్ష్మీనర్సు వివరించారు. గాంధీనగరం సమీపంలో ఎస్‌ఈజెడ్ ఏర్పాటు చేస్తే తుని హైవే, విశాఖ, రాజ మండ్రి పట్టణ ప్రాంతాలకు ఎంత దూరం వస్తుందని ఇద్దరు కలెక్టర్లు ఆర్డీవో వి.వి.రమణను అడిగా రు. ఇక్కడ అటవీ భూమి ఎంత ఉందో, జిరాయితీ భూమి ఎంత ఉందో తెలుసుకున్నారు. తాండవ, ఏలేరు కాలువలు ఎంత దూరంలో ఉన్నాయని అడిగారు. ఎస్‌ఈజెడ్ ఏర్పాటుకు కావలసిన భూమిని రైతుల నుంచి సేకరించాలని లేదా డీపట్టా భూము లు తీసుకోగా ఇంకా అవసరమయితే పెడిమికొండ అటవీ భూమిని తీసుకోవాలని భావిస్తున్నారు. అ టవీ భూమిని తీసుకుంటే దానికి బదులుగా సుందరకోట పంచాయతీలో ఉన్న గ్యాప్ ఏరియా భూమి ఇచ్చేందుకు అటవీశాఖ అధికారులతో చర్చించారు.
ఎస్‌ఈజెడ్ ఏర్పాటైతే..
అటవీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఎస్‌ఈజెడ్ నెలకొ ల్పాలని యోచిస్తున్నారు. అందుకే అల్లూరి జిల్లా కలెక్టర్ కూడా స్థల పరిశీలనకు వచ్చారు. ఏజెన్సీ నుంచి వచ్చే గిరిజన ఉత్పత్తులు, మైదాన ప్రాంత రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులు స్టాకు చేసి గిట్టుబాటు ధర లభించినప్పుడు పట్టణ ప్రాంతాలకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ పర్యటనలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కె,ఉషశ్రీ, అటవీ సెక్షన్ అధికారి చిరంజీవి, డిప్యూ టీ తహసీల్దార్ శివ, మండల సర్వేయర్ ప్రసాద్, ఎంఈవోలు సత్యనారాయణ, కామిరెడ్డి వరహా లబాబు, ఎస్‌ఐ సిహెచ్.భీమరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment